Disney Star: భారత్ లో ఐసీసీ ఈవెంట్ల మీడియా హక్కులు డిస్నీ స్టార్ కైవసం

Disney Star grabs ICC events TV and Digital rights in India
  • 2024 నుంచి 2027 వరకు మీడియా హక్కులు డిస్నీవే!
  • నాలుగేళ్ల పాటు అధికారిక ప్రసారకర్తగా డిస్నీ స్టార్
  • టీవీ, డిజిటల్ హక్కులు సొంతం
భారత్ లో నిర్వహించే ఐసీసీ ఈవెంట్ల టీవీ, డిజిటల్ హక్కులను డిస్నీ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. భారత్ వేదికగా 2024 నుంచి 2027 వరకు జరిగే పురుషుల, మహిళల క్రికెట్ ఈవెంట్లను డిస్నీ స్టార్ ప్రసారం చేయనుంది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో నిర్ధారించింది. సింగిల్ రౌండ్ సీల్డ్ బిడ్డింగ్ విధానంలో జరిగిన ఈ టెండరు ప్రక్రియలో డిస్నీ స్టార్ విజేతగా అవతరించిందని వెల్లడించింది. వచ్చే నాలుగేళ్ల పాటు డిస్నీ స్టార్ తో తమ భాగస్వామ్యం కొనసాగనుండడం సంతోషదాయకమని ఐసీసీ తెలిపింది. 

మహిళల క్రికెట్ కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు డిస్నీ స్టార్ వద్ద ఆకట్టుకునే ప్రణాళికలు ఉన్నాయని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే పేర్కొన్నారు. మహిళల క్రికెట్ ను మరింత అభ్యున్నతి దిశగా నడిపించాలన్న ఐసీసీ ఆలోచనలకు డిస్నీ స్టార్ తో భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. కాగా, భారత్ లో మీడియా హక్కులు డిస్నీ స్టార్ కు ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయన్నది ఐసీసీ వెల్లడించలేదు.
Disney Star
ICC
India
Media Rights
TV
Digital

More Telugu News