Asia Cup: యూఏఈలో ప్రారంభమైన ఆసియాకప్... తొలి మ్యాచ్ లో శ్రీలంకతో ఆఫ్ఘన్ ఢీ

Asia Cup cricket tourney has begun

  • దుబాయ్ లో ఆరంభ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
  • రాణించిన బౌలర్లు
  • లంక టాపార్డర్ కుదేల్

ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ యూఏఈలో నేడు ప్రారంభమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక జట్టు 13 ఓవర్లలో 8 వికెట్లకు 70 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి లంక టాపార్డర్ విలవిల్లాడింది. 

ఓపెనర్లు పతుమ్ నిస్సాంక 3, కుశాల్ మెండిస్ 2 పరుగులు చేశారు. వన్ డౌన్ లో వచ్చిన చరిత్ అసలంక డకౌట్ అయ్యాడు. అయితే, గుణతిలకతో (17)తో కలిసి భానుక రాజపక్స స్కోరుబోర్డును నడిపించాడు. ముజీబ్ బౌలింగ్ లో గుణతిలక అవుట్ కాగా, కాసేపటికే హసరంగ కూడా ముజీబ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. దసున్ షనకను నబీ డకౌట్ చేయడంతో లంక కష్టాలు రెట్టింపయ్యాయి. 

భానుక రాజపక్స 38 పరుగులు చేసిన అనంతరం రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మహీశ్ తీక్షణ కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ గా వెనుదిరిగాడు దాంతో శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. లంక బౌలర్లలో ఫరూకీ 2, ముజీబ్ 2, నవీన్ 1, నబీ 1 వికెట్ తీశారు.

Asia Cup
Tournament
Sri Lanka
Afghanistan
  • Loading...

More Telugu News