Congress: తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్రియాంకా గాంధీ స‌మావేశం... హాజ‌రైన బోసురాజు

congress leader priyanka gandhi meeting on telangana

  • ఇటీవ‌లే రేవంత్‌, ఉత్త‌మ్‌ల‌తో ప్రియాంకా గాంధీ భేటీ
  • తాజా భేటీలో తెలంగాణ రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌
  • మునుగోడు ఉప ఎన్నిక‌లపైనా చ‌ర్చించిన పార్టీ కీల‌క నేత‌

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ద‌క్షిణాది రాష్ట్రాల ఇంచార్జీ ప్రియాంకా గాంధీ శ‌నివారం ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఢిల్లీలో శ‌నివారం సాయంత్రం జ‌రిగిన ఈ స‌మావేశానికి ఐఏసీసీ నేత‌లు బోసురాజు, న‌దీమ్ జావెద్‌, రోహిత్ చౌద‌రిలు హాజ‌ర‌య్యారు. ఇటీవ‌లే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌హా ప‌లువురు టీపీసీసీ నేత‌ల‌తో ప్రియాంక స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే.

తాజాగా శ‌నివారం నాటి భేటీలో తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి, పార్టీ సంస్థాగ‌త అంశాల‌పై ప్రియాంకా గాంధీ దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌, ఎన్నిక‌లో పార్టీ విజ‌యావ‌కాశాలు, ఎన్నికల్లో నిలిచే పార్టీ అభ్య‌ర్థి అంశంపైనా ప్రియాంకా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

More Telugu News