Panja Vaisshnav Tej: సెన్సార్ పూర్తిచేసుకున్న 'రంగ రంగ వైభవంగా'

Ranga Ranga Vaibhavanga Movie Update

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ సరసన అలరించనున్న కేతిక శర్మ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • సెప్టెంబర్ 2వ తేదీన భారీ రిలీజ్  

వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో పరిచయమయ్యాడు. ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఆయన చేసిన 'కొండ పొలం' చాలా తక్కువ మొత్తం వసూళ్లను రాబట్టింది. దాంతో తాజా చిత్రమైన 'రంగ రంగ వైభవంగా' ఆయన మార్కెట్ ను సెట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్. 

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలు ఈ కథలో కుదిరాయనీ, ఈ సినిమాకి వచ్చిన ఏ ఒక్కరూ నిరాశతో తిరిగి వెళ్లరని వైష్ణవ్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అంటున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి..

Panja Vaisshnav Tej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie
  • Loading...

More Telugu News