Sharwanand: నేను స్టార్ ని అవునో కాదో నాకు తెలియదు: శర్వానంద్

Sharwanand Interview

  • శర్వానంద్ తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం'
  • వచ్చేనెల 9వ తేదీన సినిమా విడుదల
  • ప్రమోషన్స్ తో బిజీగా శర్వానంద్ 
  • కథను మాత్రమే నమ్ముతానంటూ వ్యాఖ్య  

ఈ మధ్య కాలంలో శర్వానంద్ హిట్ అనే మాట విని చాలా కాలమే అయింది. అలాంటి శర్వానంద్ తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం' రూపొందింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శర్వానంద్ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"కథల విషయంలో నేను కొత్తదనానికీ .. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తాను. అలా ఎంచుకున్న కథలు కొన్ని సక్సెస్ అయితే, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చేస్తుంటే, చాలామంది వద్దని చెప్పారు. అయినా చేయటం వలన నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. 

మొదటి నుంచి కూడా నేను కథలను నమ్ముకుంటూనే ముందుకు వెళుతున్నాను. ఈ రోజున నేను స్టార్ ని అవునో కాదో నాకు తెలియదు. నాకు ముందు ఇక్కడ చాలామంది ఉన్నారు .. నా తరువాత చాలామంది వచ్చారు. అయినా నేను ఇక్కడ ఇంకా ఉన్నానంటే నేను నమ్ముకున్న కథలే కారణం. నాతో ఎవరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు? ఎవరికి ఎంత స్పేస్ వెళ్లిపోతోంది? అనే ఆలోచన చేయను. మంచి కథలో నేను ఉంటే చాలానే అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Sharwanand
Ritu Varma
Amala Akkineni
Oke Oka Jeevitham Movie
  • Loading...

More Telugu News