Chandrababu: బెయిల్ పై విడుదలైన వెంగళరావుకు చంద్రబాబు ఫోన్... వీడియో ఇదిగో!
- ప్రభుత్వంపై దుష్ప్రచారంతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ టీడీపీ కార్యకర్త అరెస్ట్
- రిమాండ్ కు తిరస్కరించిన కోర్టు
- సొంత పూచీకత్తుపై వెంగళరావుకు బెయిల్
- వీరోచితంగా పోరాడావంటూ చంద్రబాబు అభినందన
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సీఐడీ పోలీసుల రిమాండ్ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం, వెంగళరావుకు సొంత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. కాగా, విడుదలైన వెంగళరావుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు.
వీరిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది .....
చంద్రబాబు: ప్రజలను, నీలాంటి వారిని భయభ్రాంతులకు గురిచేసి, తమ అరాచక పాలన కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంత బాధపడినా గానీ, నువ్వు వీరోచితంగా పోరాడావు. నీ వెంట మేమందరం ఉంటాం. ఎలా పోరాడాలో మనమందరం ప్రజలకు సందేశం అందిద్దాం. ధర్మాన్ని కాపాడడమే మన లక్ష్యం... న్యాయమే గెలుస్తుంది.
చంద్రబాబు: లీగల్ సెల్ మాత్రమే కాదు, ఇలాంటివి జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఖండించాలి. బాధితులకు సహకరించాలి. మనం పోరాటం కొనసాగిద్దాం.