G Jagadish Reddy: బీజేపీ కుట్రలను ప్రజలంతా నిలదీయాలి: జగదీశ్ రెడ్డి

BJP trying to destroy Telangana welfare says Jagadish Reddy

  • ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారన్న మంత్రి 
  • చట్టబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ 
  • తెలంగాణ సంక్షేమాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ 

బీజేపీపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మత విద్వేషాలను లేపుతూ... ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని విమర్శించారు. విపక్ష పార్టీలను, నేతలను వేధిస్తోందని... దీనికి చట్టబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని చెప్పారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమం ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణ సంక్షేమాన్ని చీకట్లోకి నెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలంతా నిలదీయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని విన్నవించారు.

More Telugu News