Vande Bharat Express: గంటకు 180 కిమీ వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించిన వందేభారత్ రైలు... వీడియో ఇదిగో!
- భారత్ లో హైస్పీడ్ ట్రాక్ ల ఏర్పాటు
- కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ట్రయల్ రన్
- నిలకడగా 180 కిమీ వేగంతో ప్రయాణించిన వందేభారత్
- వీడియో పంచుకున్న రైల్వేశాఖ మంత్రి
భారత్ లోనూ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ టెస్టులో వందేభారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం విశేషం. భారత్ లో ఇంత వేగంతో దూసుకెళ్లిన రైలు ఇప్పటివరకు లేదు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కోటా-నాగ్డా సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.
గంటకు 180 కిమీ వేగంతో వెళుతున్నా రైలు బోగీ అద్దం నిలకడగా ఉందని, ఆ వేగానికి ఎక్కడా అదిరిన దాఖలాలు లేవని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నీళ్లతో ఉన్న గ్లాసు కూడా కనిపిస్తోంది. అందులోని నీరు ఎక్కడా తొణకకపోవడం వందేభారత్ రైలు బోగీల పటిష్ఠతను చాటుతోంది.