Rohit Sharma: పాకిస్థానీ అభిమానుల కోసం మైదానం దాటి వచ్చి హగ్ ఇచ్చిన రోహిత్ శర్మ... వీడియో ఇదిగో!

Rohit Sharma hugs Pakistani fan at Dubai stadium

  • నేటి నుంచి యూఏఈలో ఆసియా కప్ టోర్నీ
  • రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్
  • దుబాయ్ స్టేడియంలో ఇరుజట్ల ప్రాక్టీస్
  • రోహిత్ శర్మ కోసం తరలివచ్చిన పాకిస్థానీలు
  • ఆకట్టుకుంటున్న వీడియో

ఆసియా కప్ క్రికెట్ టోర్నీ నేటి నుంచి షురూ కానుండగా, రేపు అత్యంత ఆసక్తికరమైన దాయాదుల సమరం జరగనుంది. దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు ఇక్కడి మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. 

కాగా, ఫ్లడ్ లైట్ల వెలుతురులో టీమిండియా ప్రాక్టీసు చేస్తుండగా, కొందరు అభిమానులు టీమిండియా సారథి రోహిత్ శర్మను కలిసేందుకు వచ్చారు. వారు పాకిస్థాన్ కు చెందినవారు. గ్రౌండ్ వెలుపల ఉన్న వారి కోసం రోహిత్ శర్మ మైదానం ఫెన్సింగ్ దాటి మరీ వచ్చాడు. అభిమానుల చేతులను తాకుతూ వారికి ఆనందాన్ని పంచాడు. వారిలో ఓ అభిమాని హగ్ కోరగా, ఫెన్సింగ్ అడ్డుగా ఉండడంతో, ఇవతలి నుంచే ఆత్మీయంగా భుజానికి భుజం తాకించి అతడిని సంతోషపెట్టాడు. 

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Rohit Sharma
Fans
Pakistan
Asia Cup
Dubai
Team India

More Telugu News