Vikram: విక్రమ్ విశ్వరూపం చూపించవలసిన సమయమే ఇది!

Cobra movie update

  • విక్రమ్ తాజా చిత్రంగా రూపొందిన 'కోబ్రా'
  • కథానాయికగా అలరించనున్న శ్రీనిధి శెట్టి
  • ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయి రిలీజ్
  • ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ 

విక్రమ్ కెరియర్ ను పరిశీలిస్తే అనేక ప్రయోగాలు .. వాటితో ముడిపడిన సాహసాలు కనిపిస్తాయి. పాత్రకి న్యాయం చేయడం కోసం తెరపై ఎలా కనిపించడానికైనా వెనుకాడని నటుడాయన. 'ఐ' సినిమాలో అంత వికృతంగా కనిపించడానికి ఆయన తప్ప మరొక హీరో ఒప్పుకోరేమో. కానీ అంతటి వైవిధ్యభరితమైన పాత్రలు చేయడమంటేనే ఆయనకి ఇష్టం.

ఇప్పటికీ కూడా ఆయన కొత్తదనానికి మొదటి ప్రాధాన్యతనిస్తాడు. తన సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, అది ఒక ప్రయోగంగా మిగిలిపోతుందని భావించే హీరో ఆయన. అందువల్లనే వరుస పరాజయాలు వెంటాడుతున్నా ఆయన తన పద్ధతిని మార్చుకోకుండా ప్రయోగాల వెంట పరుగులు పెడుతూనే ఉన్నాడు.

కొంతకాలంగా విక్రమ్ స్థాయికి తగిన సినిమాలు పడలేదు. గతంలో ఆయన సాధించిన విజయాలకు దగ్గరగా ఈ మధ్య కాలంలో ఆయన సినిమా ఏదీ వెళ్లలేదు. ఈ నెల 31వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఆయన 'కోబ్రా' సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేయవలసిందే .. లేదంటే విక్రమ్ మరికొంత వెనకబడే అవకాశం లేకపోలేదు.

Vikram
Sriniidhi Shetty
Cobra Movie
  • Loading...

More Telugu News