Anasuya: 'ఆంటీ' అంటూ అవమానించేలా పోస్టులు పెడితే పోలీసు కేసు పెడతా: అనసూయ వార్నింగ్

Anasuya warns social media trollers

  • ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందన్న అనసూయ
  • అవమానించే పోస్టులు పెడితే స్క్రీన్ షాట్లు తీసి కేసు పెడతానని వార్నింగ్
  • మీరు బాధపడే స్థాయికి తీసుకెళ్తానని హెచ్చరిక

సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మండిపడ్డారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందని అన్నారు. మీరు ఎన్ని అంటున్నా తాను దయతో వ్యవహరిస్తున్నానని... అందుకే మీరు ఇలా చేస్తున్నారని చెప్పారు.

తనను ఆంటీ అని పిలుస్తూ అవమానించేలా పోస్టులు పెడుతున్నారని... ఇకపై ఇలాంటి పోస్టులు పెడితే స్క్రీన్ షాట్లను తీసి, పోలీసు కేసు పెడతానని హెచ్చరించారు. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు మీరు బాధపడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. ఇదే తన చివరి వార్నింగ్ అని అన్నారు. 

ఇకపై తనను వేధిస్తూ మీరు చేసే ప్రతి ట్వీట్ కు రీట్వీట్ చేస్తానని... ఇలా ఎందుకు చేస్తానో తెలుసుకోవాలని అనసూయ అన్నారు. తనను వేధించడం కోసం డబ్బులు చెల్లించి, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎన్నో ఏళ్ల నుంచి ట్వీట్స్ చేయిస్తున్నారని ఆమె విమర్శించారు.

Anasuya
Tollywood
Tweets
Trolling
  • Loading...

More Telugu News