Kamal Haasan: పుకార్లకు చెక్ పెట్టిన డైరెక్టర్ శంకర్!

Shankar Movies Update

  • 'ఇండియన్ 2' షూటింగులో శంకర్ 
  • చరణ్ సినిమా ఆగిందంటూ ప్రచారం
  • వచ్చేనెల నుంచి మొదలవుతుందన్న శంకర్ 
  • హైదరాబాద్ - వైజాగ్ లలో షూటింగు జరుగుతుందంటూ క్లారిటీ   

శంకర్ ఆ మధ్య 'ఇండియన్ 2' సినిమాను పట్టాలెక్కించాడు. ఆ సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోవడంతో, చరణ్ తో సినిమాను మొదలుపెట్టేశాడు. కెరియర్ పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా. ఆయన జోడీగా కియారా అద్వాని అలరించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ నేపథ్యంలోనే 'ఇండియన్ 2' సమస్యలు తొలగిపోవడంతో, శంకర్ ఆ వైపు వెళ్లాడు. ప్రస్తుతం ఆ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. దాంతో చరణ్ ప్రాజెక్టును శంకర్ ఓ మూడు నెలల పాటు పక్కన పెట్టేశాడనీ, ఈ సినిమా విడుదల విషయంలోను ఆలస్యం కానుందనే ప్రచారం జోరందుకుంది. 

దాంతో శంకర్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, చరణ్ సినిమా .. 'ఇండియన్ 2' ఈ రెండింటిలో దేనినీ పక్కన పెట్టడం జరగదనీ, స్వల్ప విరామాలతో ఒకే సమయంలో రెండు సినిమాలను పూర్తి చేయడం జరుగుతుందని శంకర్ క్లారిటీ ఇచ్చాడు. చరణ్ సినిమా వచ్చేనెల ఫస్టు వీక్ లో హైదరాబాద్ .. వైజాగ్ లలో జరుగుతుందని స్పష్టం చేశాడు.

Kamal Haasan
Ramcharan
Shankar
  • Loading...

More Telugu News