liger: ‘లైగర్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..!

Liger box office collection Day 1

  • నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం
  • భారీ ఓపెనింగ్స్ సొంతం  చేసుకున్న లైగర్ 
  • ప్రతికూల రివ్యూలతో మధ్యాహ్నానానికే కాస్త డీలా
  • మొదటి రోజు రూ. 20-25 కోట్లు వసూలు చేసిందని అంచనా

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో, ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ప్రతికూల రివ్యూల కారణంగా చివరికి నెమ్మదించింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ‘లైగర్’ మొదటి రోజు దాదాపు రూ. 20-25 కోట్లు రాబట్టినట్లు అంచనా. 

మరోవైపు ‘లైగర్’ హిందీ వెర్షన్ విడుదల కాస్త ఆలస్యమైంది. ఇందుకు గల కారణాలు ఏమిటో తెలియలేదు. నెగెటివ్ రివ్యూలు వస్తున్న నేపథ్యంలో ‘లైగర్’ ఈ వారాంతంలో ఎలా నడుస్తుందనే దానిపై సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాను చిత్రబృందం జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించడంతో అన్ని భాషల్లో భారీగా అడ్వాన్స్ డ్ బుకింగ్స్ వచ్చాయి. దాంతో, బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్‌ లభించింది. కానీ, మధ్యాహ్నంలోపే రివ్యూలు బయటికి రావడం, బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ మౌత్ టాక్ రావడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.

liger
boxoffice
Bollywood
Vijay Devarakonda
Puri Jagannadh
ananya pandey
  • Loading...

More Telugu News