Telangana: బీజేపీలో చేరిన ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు... సాద‌రంగా ఆహ్వానించిన జేపీ న‌డ్డా

errabelli pradeep rao joins bjp

  • వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మ‌న్‌గా ప‌నిచేసిన ప్ర‌దీప్ రావు
  • త‌గిన గుర్తింపు ద‌క్క‌లేదంటూ ఇటీవ‌లే టీఆర్ఎస్‌కు రాజీనామా
  • జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన వైనం

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గానే కాకుండా కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోద‌రుడు ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు విప‌క్ష బీజేపీలో చేరిపోయారు. త‌న ముఖ్య అనుచ‌రుల‌తో క‌లిసి గురువారం ఢిల్లీ వెళ్లిన ప్ర‌దీప్ రావు బీజేపీలో చేరారు. ప్ర‌దీప్ రావును బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

తెర ముందు ద‌యాక‌ర్ రావు క‌నిపిస్తున్నా... తెర వెనుక అన్న గెలుపు కోసం తాను ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాన‌ని, అయితే త‌న‌కు త‌గిన రీతిలో గుర్తింపు ద‌క్క‌ని కార‌ణంగా తాను టీఆర్ఎస్ ను వీడుతున్న‌ట్లుగా ఇటీవ‌లే ప్ర‌దీప్ రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌దీప్‌రావు పార్టీని వీడ‌కుండా ఉండేలా టీఆర్ఎస్ సాగించిన రాయ‌బారం ప‌ని చేయ‌లేదు. గ‌తంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మ‌న్‌గా ప్ర‌దీప్ రావు ప‌నిచేశారు.

Telangana
BJP
TRS
Errabelli
Errabelli Pradeep Rao
JP Nadda

More Telugu News