Liger Movie: 'లైగర్' .. ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..!

Liger movie twitter review

  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విజయ్ దేవరకొండ 'లైగర్'
  • తొలి ఆటతో డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రం
  • ఎక్సలెంట్ అని కొందరు అంటుండగా... సెకండాఫ్ ఆకట్టుకోలేకపోయిందంటున్న మరికొందరు

సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్న విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల తాజా చిత్రం 'లైగర్' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్ సహా పలు చోట్ల ఈ చిత్రం ఉదయం 7.30 గంటలకే స్క్రీన్లపై పడింది. అభిమానులతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించి ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను చెపుతున్నారు. 

ఓవరాల్ గా ఈ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఇవే:

'లైగర్' ఎక్సలెంట్ అంటూ కొందరు అంటున్నారు. ఒక రెజ్లర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమని, ఫైటింగ్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని చెపుతున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను అన్నీ తానై నడిపించాడని కితాబునిస్తున్నారు. హీరోయిన్ అనన్య పాండే చాలా హాట్ గా ఉందని చెపుతున్నారు. ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ పాత్ర బాగుందని అంటున్నారు. 

మరికొందరు ఫస్ట్ హాఫ్ పర్వాలేదని... సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయిందని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ అని, ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. కథలో బలం లేదని, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉందని చెపుతున్నారు. 

తెలుగు సినిమాను బాలీవుడైజేషన్ చేశారంటూ ఇంకొందరు పెదవి విరిచారు. హిందీలో తీసిన సినిమాను తెలుగులో డబ్ చేశారని విమర్శిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీని ఇది అగౌరవపరచడమేనని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ భాగస్వామి కావడం అతి పెద్ద మైనస్ పాయింట్ అని చెపుతున్నారు. కరణ్ వల్ల ఈ సినిమా టాలీవుడ్ ఫ్లేవర్ ను కోల్పోయి, బాలీవుడ్ సినిమా మాదిరి తయారయిందని మండిపడుతున్నారు. పాటలు కూడా సరైన టైమ్ లో పడలేదని విమర్శిస్తున్నారు. 

ఏదేమైనప్పటికీ ట్విట్టర్ టాక్ ను గమనిస్తే... ఈ సినిమాకు తొలి ఆటతో డివైడ్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. రాబోయే షోలతో ఈ సినిమాకు సంబంధించి పక్కా రివ్యూలు వస్తాయి.

Liger Movie
Tollywood
Bollywood
Twitter
Review
Vijay Devarakonda
Puri Jagannadh
Karan Johar
  • Loading...

More Telugu News