Srinu Vaitla: పెద్ద కుమార్తె అమెరికా వెళుతుంటే తండ్రిగా శ్రీను వైట్ల వేదన... వీడియో ఇదిగో!

Srinu Vaitla shares a video

  • విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఆనంది
  • ఆనంది శ్రీను వైట్ల పెద్ద కుమార్తె
  • ఎయిర్ పోర్టులో బరువెక్కిన హృదయంతో వీడ్కోలు
  • వీడియో పంచుకున్న శ్రీను వైట్ల

టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల, కాస్ట్యూమ్ డిజైనర్ రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలన్న సంగతి తెలిసిందే. వీరి పెద్దకుమార్తె ఆనంది విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లింది. దీనిపై శ్రీను వైట్ల ట్విట్టర్ లో భావోద్వేగభరితంగా స్పందించారు. 

"అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేసేందుకు నా పెద్ద కూతురు అమెరికా వెళ్లింది. ఓ తండ్రిగా ఎంతో వేదన కలిగింది. ఇదే వయసులో నేను చెన్నై వెళుతుంటే ఆనాడు మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో ఇప్పుడు అర్థమవుతోంది. జీవితం ఓ చక్రంలాంటిది. నా గారాలపట్టి ఆనంది తండ్రిని గర్వించేలా చేస్తుందని గట్టి నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులో కుమార్తెకు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్న వీడియోను శ్రీను వైట్ల పంచుకున్నారు.

Srinu Vaitla
Daughter
Anandi
USA
Video

More Telugu News