Sensex: ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 54 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం వరకు లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగినప్పటికీ.. చివరకు స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి.

ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 59,085కి చేరుకుంది. నిప్టీ 27 పాయింట్లు పెరిగి 17,605 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.86%), ఎన్టీపీసీ (1.29%), ఎల్ అండ్ టీ (0.92%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.90%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-0.93%), టీసీఎస్ (-0.86%), టైటాన్ (-0.80%), సన్ ఫార్మా (-0.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.56%).

  • Loading...

More Telugu News