Lakshmi Parvati: జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి: లక్ష్మీపార్వతి

Junior NTR has to takeover TDP says Lakshmi Parvati

  • జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్మీపార్వతి 
  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని ఆరోపణ 
  • టీడీపీ హయాంలో 30 వేల స్కూళ్లు మూతపడ్డాయని విమర్శ 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలనేదే తన కోరిక అని చెప్పారు. 

గత చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేసిందని... టీడీపీ హయాంలో 30 వేల స్కూళ్లు మూతపడ్డాయని లక్ష్మీపార్వతి విమర్శించారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. పేద పిల్లలకు ఆంగ్ల భాషను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు.

తెలుగు భాషకు జగన్ ద్రోహం చేస్తున్నారని కొందరు అవాస్తవాలను మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో తెలుగు స్కూల్స్ ను పెద్ద సంఖ్యలో మూసేశారని అన్నారు. ఈ నెల 25న తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు.

Lakshmi Parvati
Jagan
YSRCP
Junior NTR
Tollywood
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News