Sonia Gandhi: వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియాగాంధీ.. తోడుగా రాహుల్, ప్రియాంక!

Sonia Gandhi To Head Abroad For Medical Checkup
  • సోనియా విదేశాలకు వెళ్తున్నట్టు ప్రకటించిన జైరాం రమేశ్
  • అయితే ఎప్పుడు వెళ్తున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వని వైనం
  • అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కూడా పరామర్శించనున్న సోనియా 
  • సెప్టెంబర్ 4న ఢిల్లీలో ఓ ర్యాలీలో ప్రసంగించనున్న రాహుల్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హెల్త్ చెకప్ కోసం మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలియజేసింది. సోనియాగాంధీ మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నారని... ఇదే సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి వద్దకు కూడా ఆమె వెళ్తారని ఒక ప్రకటనలో జైరాం రమేశ్ తెలిపారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక కూడా వెళ్లనున్నారని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే 'మెహంగాయ్ పర్ హల్లా బోల్' ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు. 

మరోవైపు, సెప్టెంబర్ 7న కన్నియాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేపట్టే 'భారత్ జోడో యాత్ర' ప్రారంభం కానుంది. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్న తరుణంలో సోనియా మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు, సోనియా చెకప్ కోసం ఏ దేశానికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారనే విషయాలపై మాత్రం కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.
Sonia Gandhi
Medical Checkup
Rahul Gandhi
Priyanka Gandhi
Congress

More Telugu News