Road Accident: స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం

Two Telugu students killed in fatal accident in Scotland
  • అప్పిన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మొత్తం ముగ్గురి మృతి
  • బెంగళూరుకు చెందిన విద్యార్థి కూడా మృతి
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఉన్నత విద్యాభ్యాసం కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ నెల 19న స్కాట్లాండ్ హైల్యాండ్ లోని అప్పిన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 ఏళ్ల సుధాకర్, హైదరాబాద్ కు చెందిన పవన్ బాశెట్టి (23) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ కు చెందిన సాయివర్మ (24) తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన చేశారు. పవన్ బాశెట్టి, గిరీశ్ సుబ్రహ్మణ్యం లీసెస్టర్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేస్తున్నారు. సుధాకర్ కు మాస్టర్స్ పూర్తయింది.
Road Accident
Telugu Students
Death
Scotland

More Telugu News