Sonia Gandhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సోనియాగాంధీ

Sonia Gandhi meets Droupadi Murmu

  • రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన సోనియాగాంధీ
  • వీరిద్దరి భేటీ గురించి ట్వీట్ చేసిన రాష్ట్రపతి కార్యాలయం
  • కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఎక్కువైన సమయంలో రాష్ట్రపతిని కలిసిన సోనియా

భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన సోనియాగాంధీ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వీరు భేటీ అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రాష్ట్రపతితో సోనియాగాంధీ సమావేశమయ్యారని తెలిపింది. 

కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో అట్టుడుకుతున్న వేళ రాష్ట్రపతిని సోనియా కలిశారు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అవమానాలను భరించే స్థితిలో తాను లేనని... రాజీనామా చేయడం మినహా తనకు మరో దారి లేదని ఆయన అన్నారు. ఆనంద్ శర్మకు నచ్చచెప్పేందుకు రాజీవ్ శుక్లాను కాంగ్రెస్ హైకమాండ్ పంపించింది. ఆనంద్ శర్మతో భేటీ అనంతరం సోనియాను కలిసేందుకు శుక్లా ఢిల్లీకి వెళ్లారు.

Sonia Gandhi
Droupadi Murmu
Congress
  • Loading...

More Telugu News