India: ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా... అప్డేట్స్ ఇవిగో
- గత 24 గంటల్లో 8,586 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న 9,680 మంది పేషెంట్లు
- 96,506కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా నెమ్మదిస్తోంది. ప్రస్తుతం కేసులు నమోదవుతున్న తీరు చూస్తుంటే మహమ్మారి అదుపులోకి వస్తున్నట్టే కనిపిస్తోంది. గత 24 గంటల్లో 3.91 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 8,586 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే వెయ్యికి పైగా చెప్పున కేసులు వచ్చాయి.
మరోవైపు గత 24 గంటల్లో 9,680 మంది కరోనా నుంచి కోలుకోగా... 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో దేశంలో యాక్టివ్ కేసులు లక్షకు దిగువకు రావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని క్రియాశీల కేసుల సంఖ్య 96,506కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.59 శాతంగా, క్రియాశీల రేటు 0.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 210 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 29.25 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.