Jani Master: హీరోగా జానీ మాస్టర్ .. 'యథా రాజా తథా ప్రజా' మూవీ ప్రారంభం!

Yatha Raja Thatha Praja Movie

  • కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ బిజీ 
  • 'యథారాజా తథాప్రజా'తో హీరోగా ఎంట్రీ
  • చిరూ బర్త్ డే నాడు తన సినిమా మొదలు కావడం పట్ల హర్షం
  • త్వరలోనే  రెగ్యులర్ షూటింగ్ అంటూ వెల్లడి

కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి మంచి పేరుంది. తెలుగు .. తమిళ సినిమాలతో కొరియోగ్రాఫర్ గా ఆయన బిజీగా ఉన్నాడు. ప్రభుదేవా .. లారెన్స్ మాదిరిగానే ఆయన కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన మొదటి సినిమాగా 'యథా రాజా తథా ప్రజా' సినిమా పట్టాలెక్కింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ మాట్లాడుతూ .. "తెలుగు సినిమాను ఒక మలుపు తిప్పిన చిరంజీవిగారి పుట్టినరోజున నా సినిమా మొదలుకావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా సినిమా ఓపెనింగ్ కి పిలవగానే శర్వానంద్ గారు వచ్చినందుకు సంతోషంగా ఉంది" అన్నాడు.  

దర్శకుడు శ్రీనివాస్ గారు ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది .. జనంలోకి వెంటనే వెళ్లే ఒక మంచి టైటిల్ దొరికింది. డాన్సులంటే నేను కుమ్మేస్తానుగానీ .. యాక్టింగ్ మాత్రం నాకు కొత్తనే. అయినా మీ అందరినీ మెప్పించగలననే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుంది" అని చెప్పుకొచ్చాడు.

Jani Master
Srinivas
Yatha Raja Thatha Praja Movie
  • Loading...

More Telugu News