Nagashourya: దర్శకేంద్రుడి చేతుల మీదుగా నాగశౌర్య మూవీ లాంచ్!

Naga Shaurya new movie update

  • కొత్త దర్శకుడితో నాగశౌర్య సినిమా 
  • కథానాయికగా యుక్తి తరేజా పరిచయం 
  • సంగీత దర్శకుడిగా పవన్ సీ హెచ్ 
  • వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే అవకాశం

నాగశౌర్య కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. యాక్షన్  సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదనే ఉద్దేశంతో, 'వరుడు కావలెను' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తనకి అచ్చొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. 

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా .. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. 'లవ్ స్టోరీ' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా యుక్తి తరేజా అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగశౌర్య సెట్స్ పైకి తీసుకెళ్లిన 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' .. 'పోలీస్ వారి హెచ్చరిక' నుంచి అప్ డేట్స్ రావలసి ఉంది..

Nagashourya
Yukthi
Pavan Basimi shetty Movie
  • Loading...

More Telugu News