Sada: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సినీ నటి సదా స్పందన

Sada comments on Uday Kiran Suicide

  • ఉదయ్ ఆత్మహత్య చేసుకుంటాడని ఎప్పుడూ అనుకోలేదన్న సదా 
  • సమస్య వచ్చినప్పుడు చావు పరిష్కారం కాదని వ్యాఖ్య 
  • ఉదయ్ కెరీర్లో తప్పు ఎక్కడ జరిగిందో తెలియదన్న సదా 

టాలీవుడ్ లో అత్యంత విషాదకరమైన ఘటనల్లో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఒకటి. చిన్న వయసులోనే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్... సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఉదయ్ నటించి పలు చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. కేవలం యూత్ కు మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా ఇష్టమైన హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. 

అయితే, ఉదయ్ మృతిపై ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడారు. రకరకాల కారణాల గురించి చెప్పారు. తాజాగా ఉదయ్ సరసన నటించిన హీరోయిన్ సదా ఆయన మృతిపై స్పందించింది. 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ తో సదా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ తో ఆమె మరో విజయాన్ని అందుకుంది. 

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతుండగా ఉదయ్ కిరణ్ ప్రస్తావన వచ్చింది. ఒక మంచి నటుడిని కోల్పోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించింది. ఉదయ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదని తెలిపింది. ఆయన ఎంతో మంచి వ్యక్తి అని, ఆయన కెరీర్లో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదని చెప్పింది. 

ఏం జరిగినా ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదని... కొన్నిసార్లు అవకాశాలు వస్తాయని, కొన్నిసార్లు రావని... సినిమాల కంటే జీవితం ముఖ్యమని అన్నారు. జీవితం అంటేనే పోరాటమని... సమస్య వచ్చినప్పుడు చావే పరిష్కారం కాదని తెలిపింది. ఒక యాక్టర్ గా మనం బెస్ట్ ఇవ్వాలని... ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్పింది.

Sada
Uday Kiran
Suicide
Tollywood
  • Loading...

More Telugu News