Panja Vaisshnav Tej: రేపు సాయంత్రం 'రంగరంగ వైభవంగా' ట్రైలర్ రిలీజ్!

Ranga Ranga Vaibhavanga Movie Update

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ 
  • సంగీతాన్ని అందించిన దేవిశ్రీ
  • వచ్చేనెల 2వ తేదీన సినిమా రిలీజ్  

'ఉప్పెన' .. 'కొండ పొలం' సినిమాలలో మాస్ టచ్ ఉన్న పాత్రలను పోషించిన వైష్ణవ్ తేజ్, ఈ సారి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'రంగ రంగ వైభవంగా' ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

తమిళంలో 'అర్జున్ రెడ్డి' సినిమా రీమేక్ చేసిన గిరీశాయ ఈ ఫ్యామిలీ ఎంటర్టయినర్ కి దర్శకత్వం వహించాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. వైష్ణవ్ తేజ్ తో పాటు కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమా కావడం విశేషం. నరేశ్ .. ప్రభు .. తులసి .. శ్రీలక్ష్మి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు..

Panja Vaisshnav Tej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie
  • Loading...

More Telugu News