Amit Shah: కేసీఆర్ పాలనను అంతమొందించడానికి ఇది ప్రారంభం: అమిత్ షా

This is beginning to KCR down fall says Amit Shah
  • కేసీఆర్ కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోతోందన్న అమిత్ షా
  • కేసీఆర్ పాలనను పడగొట్టేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారని వ్యాఖ్య
  • కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపాటు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర హోం మంత్రి నిప్పులు చెరిగారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోతోందని... కేసీఆర్ పాలనను పడగొట్టడానికి ఇది ప్రారంభమని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సీఎం ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారని అన్నారు. మునుగోడు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని రైతు బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదని చెప్పారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అబద్ధం చెప్పారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినప్పటికీ... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్... దళితులను మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాకో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మాస్తామని కేసీఆర్ చెప్పారని... నల్గొండకు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు... అందరికీ వచ్చాయా? అని అడిగారు. గిరిజనులకు భూములు ఇస్తామని కేసీఆర్ చెప్పారని... ఒక్క ఎకరా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు.
Amit Shah
Komatireddy Raj Gopal Reddy
BJP
KCR
TRS

More Telugu News