BJP: భాగ్య న‌గ‌రి చేరిన అమిత్ షా... మ‌హంకాళి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన కేంద్ర హోం మంత్రి

amit shah reaches hyderabad and visits mahankali temple

  • బేగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండైన అమిత్ షా
  • స్వాగ‌తం ప‌లికిన కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌, ల‌క్ష్మ‌ణ్‌
  • మ‌రికాసేప‌ట్లో మునుగోడు బ‌య‌లుదేర‌నున్న బీజేపీ అగ్ర నేత‌

బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, పార్టీ రాష్ట్ర ఇంచార్జీ త‌రుణ్ చుగ్ త‌దిత‌రులు అమిత్ షాకు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్థానిక బీజేపీ నేత‌లతో క‌లిసి సికింద్రాబాద్ ప‌రిధిలోని ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి ఆల‌యాన్ని వెళ్లిన అమిత్‌ షా ... అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 

మునుగోడులో ఆదివారం సాయంత్రం జ‌ర‌గ‌నున్న బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా హాజ‌రుకానున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌లో ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌నున్నారు. ఈ స‌భ కోస‌మే అమిత్ షా ఆదివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

More Telugu News