Shiv Sena: అంత వయసులోనూ అవ్వ ఉట్టి ఎలా కొట్టిందో.. వీడియో చూడండి.. 

Age only a number Sena  tweets inspiring Dahi Handi video

  • దేశవ్యాప్తంగా ఉత్సాహంగా ఉట్టి కొట్టుడు వేడుకలు
  • మహారాష్ట్రలో ఓ వేడుక వీడియోను షేర్ చేసిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
  • వయసు కేవలం నంబరేనంటూ ట్వీట్

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉత్తరాదిన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉట్టి కొట్టుడు కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడు వెన్నదొంగ అని తెలిసిందే. వెనుక ఉట్టిలో పెరుగు, వెన్న, పాలు ఉంచేవారు. పిల్లలకు అందకుండా అలా ఏర్పాటు చేసేవారు. అయినా, చిన్ని కృష్ణ స్నేహితుల సాయంతో అందులోని పదార్థాలను తినేసేవాడంటూ ఆయనపై యశోదకు నిత్యం ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి. 

ఈ ఆచారాన్ని (మఖాన్ చోర్) తదుపరి తరాలకు బదిలీ చేసే కార్యక్రమమే ఉట్టి కొట్టుడు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతున్నాయి. అందులో 70 ఏళ్లకు పైగా వయసున్న ఓ వృద్ధురాలు పది మంది మహిళల చేతులు, భుజాల సాయంతో పైకి ఎగిరి తాడుకు కట్టిన ఉట్టిని తలతో కొట్టేసి మరీ కిందకు దిగిపోవడం చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ వీడియోను ట్వీట్ చేశారు. 

వయసు అన్నది కేవలం ఓ నంబర్ మాత్రమే. మనం వృద్ధులమయ్యేంత వరకు, అది లెక్కించేది కాదని తెలుసుకునే వరకు లెక్కిస్తుంటాం’’అన్న కత్రినా మేయర్ క్వొటేషన్ ను అవ్వ రుజువు చేసిందంటూ ప్రియాంక చతుర్వేది వీడియోకు అనుబంధంగా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News