: రూపాయి @ 56.54
రూపాయి ఈ రోజు కూడా నష్టాలలోనే కొనసాగుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 16 పైసలు నష్టపోయి 56.54వద్ద ట్రేడవుతోంది. రూపాయి ఎంతగా నష్టపోతే ప్రభుత్వ ఖజానాపై అంతగా భారం పడుతుంది. చమురు, ఆహారధాన్యాల దిగుమతులు విలువ అధికమై లోటు పెరిగిపోతుంది. రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణం డాలర్ బలపడడం. రెండోది బంగారం దిగుమతులు ఎక్కువయ్యాయి. ఫలితంగా డాలర్ కొనుగోళ్లు పెరిగి రూపాయి విలువ క్షీణతకు దారితీస్తోంది.