Konda Surekha: మునుగోడులో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా కేసీఆర్: కొండా సురేఖ‌

congress leader konda surekha warning to kcr

  • ఉద్య‌మంలో న‌ల్ల‌గొండ వాసుల‌ది న‌లిగిన చ‌రిత్ర అన్న సురేఖ
  • ఉద్య‌మ‌కారుల‌ను న‌లిపేసిన చ‌రిత్ర కేసీఆర్‌దంటూ విమ‌ర్శ‌
  • మునుగోడులో కేసీఆర్ ప్ర‌సంగం మొద‌లు కాగానే ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత‌

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన వేళ‌... మునుగోడులో టీఆర్ఎస్ శ‌నివారం భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు స్వ‌యంగా సీఎం కేసీఆర్ హాజ‌రై... విప‌క్షాల‌పై నిప్పులు కురిపించారు. మునుగోడులో స‌రిగ్గా కేసీఆర్ ప్ర‌సంగం ప్రారంభ‌మైన మ‌రుక్ష‌ణ‌మే కాంగ్రెస్ నేత కొండా సురేఖ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేసీఆర్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. 

'తెలంగాణ ఉద్యమాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నల్లగొండ జిల్లా వాసులది నాడు నలిగిపోయిన చరిత్ర .. అధికారం వచ్చాక ఉద్యమకారులను నలిపేసిన చరిత్ర నీది' అంటూ కేసీఆర్‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. 'ఆనాడు నీ విషపు కోరల్లో బందీ అయినారు... కానీ నేడు మునుగోడు లో నీకు మూడు చెరువుల నీళ్లు తాగించడం పక్కా కేసీఆర్' అంటూ హెచ్చ‌రించారు.

More Telugu News