Jhulan Goswami: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ మహిళా క్రికెటర్

India Pacer Jhulan Goswami To Retire From International Cricket

  • ఇండియన్ పేసర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్
  • మూడు ఫార్మాట్లలో 352 వికెట్లు తీసిన ఘనత
  • అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ గా రిటైర్ అవుతున్న గోస్వామి

టీమిండియా మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో ఫైనల్ వన్డే తర్వాత ఇక ఆడబోనని ఆమె ప్రకటించారు. ఇగ్లండ్ తో జరగబోయే వన్డే జట్టుకు ఆమెను నిన్ననే ఎంపిక చేశారు. 2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆమె భారత జట్టుకు దూరమవుతున్నారు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు ఆమె అందుబాటులో ఉండరు. మహిళ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా గోస్వామి రిటైర్ అవుతున్నారు. మూడు ఫార్మాట్లలో ఆమె ఇప్పటి వరకు 352 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే సిరీస్ సెప్టెంబర్ 18న ప్రారంభం కానుంది. 

మరోవైపు... గోస్వామి అత్యంత సన్నిహితురాలైన తెలుగుతేజం, ప్రపంచ మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు గోస్వామి రిటైర్మెంట్ పై క్రికెట్ అభిమానులు స్పందిస్తూ, దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతున్నారు. భారత మహిళా క్రికెట్ కు మరో రూపంలో ఆమె సేవలు అవసరమని అంటున్నారు. బీసీసీఐ ఆమె అనుభవాన్ని వాడుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News