CPI Narayana: మునుగోడు మిన‌హా దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌కే మా మద్ద‌తు: సీపీఐ నారాయ‌ణ‌

cpi narayana comments on cogress

  • తెలంగాణ‌లో కాంగ్రెస్ కొంప స‌రిగా లేద‌న్న నారాయ‌ణ‌
  • అందుకే మునుగోడులో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తిచ్చామ‌ని వెల్ల‌డి
  • భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌కు భ‌రోసా లేద‌న్న సీపీఐ నేత‌

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు క‌మ్యూనిస్టు పార్టీ సీపీఐ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు గ‌ల కార‌ణాలను తాజాగా సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా తాము కాంగ్రెస్ పార్టీకే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నామ‌ని  ఆయ‌న చెప్పారు. అయితే మునుగోడులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌ని నిర్ణయించామ‌న్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కొంప స‌రిగా లేని కార‌ణంగానే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించామ‌ని నారాయ‌ణ తెలిపారు. భవిష్య‌త్తు రాజ‌కీయాల‌కు ఏ ఒక్క‌రూ భ‌రోసా ఇవ్వ‌లేర‌ని కూడా నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

More Telugu News