Telangana: అదిరేటి స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన మంత్రి మ‌ల్లారెడ్డి.. వీడియో ఇదిగో

ts minister mallareddy dances on his car roof top

  • మునుగోడు స‌భ‌కు భారీ కాన్వాయ్‌తో బ‌య‌లుదేరిన కేసీఆర్‌
  • ఈ ర్యాలీలో పాలుపంచుకున్న మ‌ల్లారెడ్డి
  • కారు రూఫ్ టాప్‌పై నిల‌బ‌డి డ్యాన్సులేసిన మంత్రి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి ఏ ప‌ని చేసినా... ఇట్టే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు. వెరైటీ బాట ప‌ట్టే మ‌ల్లారెడ్డి... నిత్యం వివాదాలతో స‌హ‌వాసం చేస్తుంటారు. తాజాగా కారు రూఫ్ టాప్‌లో నిల‌బ‌డి అదిరేటి రీతిలో స్టెప్పులేసిన మ‌ల్లారెడ్డి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతోంది. వ‌య‌సు మీద ప‌డుతున్నా.. కుర్రాడికి మ‌ల్లే మ‌ల్లారెడ్డి ఈ వీడియోలో స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసేశారు.

మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ శ‌నివారం మునుగోడులో ప్ర‌జా దీవెన స‌భ పేరిట భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు రోడ్డు మార్గం మీదుగా సీఎం కేసీఆర్ వేలాది కార్ల‌తో కూడిన భారీ కాన్వాయ్‌తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరారు. ఈ ర్యాలీలో మ‌ల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయ‌న త‌న కారు రూఫ్ టాప్‌పై నిల‌బ‌డి డ్యాన్సులేశారు.

More Telugu News