iPhones: యాపిల్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు.. అప్ డేట్ విడుదల

Apple fixes 2 dangerous security flaws on iPhones and Macs

  • రెండు ప్రమాదకరమైన లోపాల గుర్తింపు
  • వాటిని వెంటనే సరిచేసిన యాపిల్
  • ఇందుకు సంబంధించి సెక్యూరిటీ అప్ డేట్ల విడుదల
  • వెంటనే అప్ డేట్ చేసుకోవాలంటూ యూజర్లకు సూచన

భద్రతకు భరోసా ఉండే యాపిల్ ఫోన్లలోనూ లోపాలు వెలుగు చూశాయి. దీంతో అత్యవసరంగా యాపిల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండు ప్రమాదకరమైన లోపాలను సరిదిద్దినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ అప్ డేట్ ను సిద్ధం చేసింది. యాపిల్ ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ యూజర్లు దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని కోరింది. 

ఐవోఎస్ 15.6.1, మ్యాక్ ఓఎస్ మాంటెరీ 12.5.1, ఐప్యాడ్ ఓఎస్ 15.6.1 అప్ డేట్స్ భారత్ లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. వెంటనే ప్యాచ్ అప్ డేట్ చేసుకోకపోతే.. లోపాల కారణంగా అటాకర్లు చొరబడి సున్నితమైన డేటాను చోరీ చేయవచ్చని యాపిల్ హెచ్చరించింది. అయితే, ఆ లోపాలు ఏంటన్నది యాపిల్ స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే, యాపిల్ వినియోగదారుల కోసం అప్ గ్రేడ్ చేసిన సఫారీ 15.6.1. వెర్షన్ కూడా విడుదల చేసింది.

  • Loading...

More Telugu News