Telangana: ఎల్లుండి మునుగోడుకు అమిత్ షా... బీజేపీ బ‌హిరంగ స‌భ పోస్ట‌ర్ ఇదే

komatireddy rajagopal reddy will join in bjp in the presence of amit shah

  • ఆదివారం బీజేపీలోకి రాజ‌గోపాల్ రెడ్డి చేరిక‌
  • స్వ‌యంగా ఆహ్వానించనున్న అమిత్ షా
  • మునుగోడులో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స‌భ‌

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేసిన రాజీనామా...న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌రికొత్త రాజ‌కీయ సంద‌డికి తెర తీసింది. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదించ‌డంతో మునుగోడుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోని మూడు ప్ర‌ధాన పార్టీలు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు స‌మ‌ర స‌న్నాహాలు చేస్తున్నాయి.

మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎల్లుండి (శ‌నివారం) బీజేపీలో చేర‌నున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ స‌భ‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా హాజ‌రుకానున్నారు. ఈ మేర‌కు స‌భకు 2 రోజుల ముందుగా బీజేపీ తెలంగాణ శాఖ మునుగోడు బ‌హిరంగ స‌భ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం ఆవిష్క‌రించింది. మునుగోడులో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈ స‌భ ప్రారంభం కానుంది.

More Telugu News