Amit Shah: రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా

Amit Shah to go to Ramoji Film City

  • 21న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా
  • మునుగోడు బహిరంగసభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి
  • సభ అనంతరం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న వైనం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 21న ఆయన హైదరాబాదుకు వస్తున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 4.15 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో కాసేపు సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు అక్కడి బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. 

సభ అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. రామోజీ ఫిలిం సిటీలో 6.45 నుంచి 7.30 వరకు ఉంటారు. అనంతరం శంషాబాద్ లోని నొవోటెల్ హోటల్ చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 గంటల వరకు  పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

Amit Shah
BJP
Ramoji Rao
  • Loading...

More Telugu News