Nalgonda District: రేపే మునుగోడులో కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌... పోస్ట‌ర్ ఇదిగో

trs releases its munugodu public meeting poster

  • రేపు మునుగోడు మండల కేంద్రంలో స‌భ‌
  • మ‌ధ్యాహ్నం 2 గంల‌కు సభ మొద‌లు ‌
  • అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నున్న కేసీఆర్‌

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేప‌థ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా రాష్ట్రంలోని 3 ప్ర‌ధాన పార్టీలు ఈ ఎన్నిక‌కు సంబంధించిన త‌మ అభ్య‌ర్థి పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే రేపు (శ‌నివారం) మునుగోడులో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో టీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నుంది.

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఇప్ప‌టికే సూత్ర‌ప్రాయంగా ఖ‌రారు చేసింది. ఈ విష‌యాన్ని రేప‌టి మునుగోడు స‌భ‌లో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించనున్నారు. ఈ క్ర‌మంలో రేపు మునుగోడు మండ‌ల కేంద్రంలో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను టీఆర్ఎస్ శుక్ర‌వారం ఆవిష్క‌రించింది. ఈ స‌భ‌కు ప్ర‌జా దీవెన స‌భ అనే పేరు పెట్టింది. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఈ స‌భ‌లో మునుగోడు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించ‌నున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచే అభ్యర్థి పేరును కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు.

More Telugu News