YSRCP: నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ?: విజ‌య‌సాయి రెడ్డి

vijay sai reddy tweet on nara lokesh

  • గోరంట్ల వీడియోపై కొన‌సాగుతున్న టీడీపీ దాడి
  • టీడీపీ దాడుల‌కు ఘాటుగా ప్ర‌తిస్పందిస్తున్న వైసీపీ నేత‌లు
  • నారా లోకేశ్ పాత ఫొటోల‌తో ట్వీట్ చేసిన సాయిరెడ్డి

ఓ మ‌హిళ‌తో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా చెబుతున్న వీడియో వ్య‌వ‌హారంపై ఏపీలో అధికార‌, విప‌క్షాల మధ్య ఇంకా మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయిన ఈ వీడియోను ఆధారం చేసుకుని టీడీపీ నేత‌లు గోరంట్ల‌తో పాటు సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో వైసీపీ నేత‌లూ అందుకు దీటుగానే స్పందిస్తున్నారు. తాజాగా శుక్ర‌వారం టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ల‌క్ష్యంగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్ది సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడి చేశారు.

'నీతిసూక్తులు చెప్పే ముందు నీ విదేశీ గర్ల్ ఫ్రెండ్సు నడుముకు తాడుచుట్టి కవ్వంలా తిప్పావే.. స్విమ్మింగ్ పూల్ లో హాఫ్ నేక్డ్ గా వాళ్లతో జలక్రీడలు ఆడావే.. వాళ్ళని తీసుకొచ్చి డ్రగ్స్, మద్యం తీసుకోలేదని, అనైతిక పనులు జరగలేదని చెప్పించు పప్పూ. నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ?' అంటూ సాయిరెడ్డి స‌ద‌రు పోస్టులో లోకేశ్‌కు స‌వాల్ విసిరారు.

YSRCP
YS Jagan
Vijay Sai Reddy
Nara Lokesh
TDP
Andhra Pradesh
Gorantla Madhav
  • Loading...

More Telugu News