Dil Raju: టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు

Dil Raju opines on Tollywood issues

  • చిత్ర పరిశ్రమ అంశాలపై దిల్ రాజు వివరణ
  • త్వరలోనే సినిమా షూటింగులు
  • ఫిలిం చాంబర్, 'మా'తో ఒప్పందం కుదుర్చుకున్నామన్న దిల్ రాజు
  • మన ఇండస్ట్రీని బాలీవుడ్ గమనిస్తోందని వెల్లడి

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అంశాలపై దిల్ రాజు స్పందించారు. ఫిలిం చాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)తో ఒప్పందం కుదుర్చుకున్నామని దిల్ రాజు వెల్లడించారు. సినిమా నిర్మాణ వ్యయాలపై మరో రెండు మూడు రోజుల్లో చర్చించి త్వరలోనే ప్రకటన చేస్తామని తెలిపారు. ఫిలిం ఫెడరేషన్ తో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటున్నామని అన్నారు. త్వరలోనే సినిమా షూటింగులు మొదలుపెడతామని దిల్ రాజు పేర్కొన్నారు. 

బాలీవుడ్ కూడా మన ఫిలిం ఇండస్ట్రీని గమనిస్తోందని వెల్లడించారు. టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారని వివరించారు. అటు, దక్షిణాదిలోని ఇతర చిత్ర పరిశ్రమలు మన నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నాయని దిల్ రాజు తెలిపారు.  

ఇక, 8 వారాల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించారని వెల్లడించారు. మల్టీప్లెక్స్ ల విషయంలో ధరలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధరలు, వీపీఎఫ్ చార్జీలపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు.

Dil Raju
Tollywood
Shootings
Bollywood
  • Loading...

More Telugu News