Electricity: వచ్చే ఆరు నెలల్లో ఏపీలో అందుబాటులోకి 1,600 మెగావాట్ల విద్యుత్
- ఈ వేసవిలో విద్యుత్ కు అధిక డిమాండ్
- ఏపీలో తీరనున్న కరెంటు సమస్యలు
- కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్లు
- ఎన్టీపీఎస్ నుంచి మరో 800
ఏపీలో కరెంటు కష్టాలు తీరనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. వచ్చే 6 నెలల్లో ఏపీలో 1,600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. అక్టోబరు నాటికి కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టు నుంచి 800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్టీపీఎస్ నుంచి మరో 800 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అందుబాటులోకి వస్తుందని వివరించారు.
రాష్ట్రంలో ఈ వేసవిలో అధిక డిమాండ్ కారణంగా విద్యుత్ కొరత తీవ్రస్థాయిలో నెలకొంది. ఏప్రిల్ లో విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా, 180 మిలియన్ యూనిట్లే ఉత్పత్తిలో ఉందని రాష్ట్ర ఇంధన శాఖ నాడు పేర్కొంది. 55 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడగా, ఎక్చేంజిల ద్వారా కొనుగోలు చేశారు.