Balakrishna: ఎంపీ మాధవ్ పై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి: బాలకృష్ణ

Balakrishna questions CM Jagan over MP Madhav issue

  • హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పర్యటన
  • లేపాక్షిలో టీడీపీ బాదుడే బాదుడు
  • గోరంట్ల మాధవ్ అంశాన్ని ప్రస్తావించిన బాలయ్య

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజాసేవ చేయకుండా ప్రజలకు నీలి చిత్రాలు చూపించిన ఎంపీపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేస్తే గెలిచిన ఎంపీ సభ్య సమాజం తలదించుకునే పనిచేశారని బాలకృష్ణ విమర్శించారు. ఎంపీ మాధవ్ హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు ఏ ముఖంతో వచ్చారని ప్రశ్నించారు.

Balakrishna
MP Gorantla Madhav
CM Jagan
TDP
YSRCP
  • Loading...

More Telugu News