Sudheer Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వీడియో సాంగ్ రిలీజ్!

 Aa Ammayi Gurinchi Meeku Cheppali Lyeical Song Released

  • ఇంద్రగంటి నుంచి రానున్న సినిమా  
  • సుధీర్ బాబు జోడీగా కనిపించనున్న కృతి శెట్టి
  • సినిమా ప్రపంచం నేపథ్యంలో నడిచే కథ
  • వచ్చేనెల 16వ తేదీన విడుదల  

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాలో సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి అలరించనుంది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 16వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "మీరే హీరోలా ఉన్నారు .. మరి తెరంగేట్రం ఎప్పుడు చేస్తారు? ఆ పని మనకెందుకు మాస్టారూ .. మైటీ హీరోలే మన మాటింటారు" అంటూ ఈ సాంగ్ నడుస్తోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను విజయ్ బృందం ఆలపించింది. 

ఈ సినిమాలో హీరో.. సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తాడు. జర్నలిస్టుల ప్రశ్నలకు హీరో ఇచ్చే సమాధానాలే పాట రూపంలో అందించారు. ట్యూన్ కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. వర్మ సినిమాల్లో పాటలను గుర్తుకు వచ్చేలా ఈ పాట సాగింది. రెండు ఫ్లాపుల తరువాత కృతి శెట్టి నుంచి వస్తున్న ఈ సినిమా, ఆమెకి హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News