Nassar: షూటింగ్ లో గాయపడిన నాజర్... తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తరలింపు

Actor Nassar hospitalized after severe injury in shooting

  • హైదరాబాదులో షూటింగ్
  • పోలీస్ అకాడమీలో సన్నివేశాల చిత్రీకరణ
  • మెట్ల పైనుంచి జారిపడిన నాజర్
  • కంటి కింద తీవ్ర గాయం

సీనియర్ నటుడు నాజర్ ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ జరుగుతుండగా, మెట్లపై నుంచి జారిపడ్డారు. దాంతో ఆయన ఎడమ కంటి కింద తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో నాజర్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. నాజర్ గాయపడడంతో సెట్స్ పై ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని యూనిట్ సభ్యులు కోరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు నాజర్ ఆసుపత్రిపాలవడం పట్ల స్పందించారు. నాజర్ ను ఫోన్ ద్వారా పరామర్శించారు.

Nassar
Injury
Shooting
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News