Adi saikumar: ఇద్దరికీ ఈ సినిమా కీలకమే!

Tees Maar Khan Movie Update

  • 'తీస్ మార్ ఖాన్' గా ఆది సాయికుమార్ 
  • నాయికగా పాయల్ రాజ్ పుత్
  • దర్శకుడిగా కల్యాణ్ జీ పరిచయం 
  • ఈ నెల 19వ తేదీన సినిమా విడుదల

ఆది సాయికుమార్ హీరోగా 'తీస్ మార్ ఖాన్' సినిమా రూపొందింది. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కల్యాణ్ జీ దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్ సరసన నాయికగా పాయల్ రాజ్ పుత్ కనువిందు చేయనుంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ లుక్స్ తో స్టూడెంట్ గా .. రౌడీగా .. పోలీస్ గా కనిపించనున్నాడు.

కొంత కాలంగా ఆది సాయికుమార్ కి హిట్ లేదు. తనవంతు ప్రయత్నంగా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. డాన్సులలోను .. ఫైట్లలోను ఆయనకి వంక బెట్టవలసిన అవసరం లేదు. కథల ఎంపికలోనే దెబ్బతింటున్నాడనే టాక్ ఉంది. ఈ సారి మాత్రం అలా జరగదని ఆయన గట్టిగానే చెబుతున్నాడు.

ఇక పాయల్ కి కూడా ఈ మధ్య కాలంలో హిట్ అనేది పడలేదు. వెబ్ సిరీస్ లు వచ్చినా .. స్పెషల్ సాంగ్స్ వచ్చినా చేసుకుంటూ వెళుతోంది. ఆమె కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను చెప్పింది. ఇద్దరి నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి..

Adi saikumar
payal
Tees Maar Khan Movie
  • Loading...

More Telugu News