Nikhil: ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పిన నిఖిల్

Actor Nikhil thanks Prabhas

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'కార్తికేయ 2' 
  • నిఖిల్ తో పాటు టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపిన ప్రభాస్
  • ప్రభాస్ భాయ్ మీ విషెస్ కి ధన్యవాదాలు అన్న నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ2' చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి ఉత్తరాదిన కూడా మంచి స్పందన వస్తోంది. మొత్తం మీద ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విజయం సాధించడంపై సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమా టీమ్ కు అభినందనలు తెలిపాడు. 'నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, చందూ మొండేటి, భైరవుడు, 'కార్తికేయ2' టీమ్ సభ్యులందరికీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు' అని ప్రభాస్ ట్వీట్ చేశాడు. 

ప్రభాస్ ట్వీట్ పట్ల నిఖిల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రభాస్ భాయ్ మీ విషెస్ కి ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చాడు. మీ మెసేజ్ తో 'కార్తికేయ2' టీమ్ ఎంతో సంతోషపడింది అని పేర్కొన్నాడు. 

More Telugu News