BJP: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం... కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..!

BJP Central Election Committee

  • 15 మందితో కేంద్ర ఎన్నికల కమిటీ నియామకం
  • దేవేంద్ర ఫడ్నవిస్, భూపేంద్ర యాదవ్ లకు చోటు
  • కమిటీలో చోటు కోల్పోయిన గడ్కరీ, చౌహాన్

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. 15 మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో కొత్తగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, భూపేంద్ర యాదవ్, ఓం మాథుర్ లకు చోటు కల్పించారు. పాత కమిటీలో సభ్యులైన నితిన్ గడ్కరీ, శివ్ రాజ్ సింగ్ చౌహాన్, షానవాజ్ హుస్సేన్ లను కొత్త కమిటీ నుంచి తొలగించారు. నితిన్ గడ్కరీ, చౌహాన్ లను పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా తొలగించడం గమనార్హం. 

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు వీరే:
  • జేపీ నడ్డా
  • నరేంద్ర మోదీ
  • రాజ్ నాథ్ సింగ్
  • అమిత్ షా
  • యడియూరప్ప 
  • శర్బానంద్ సోనోవాల్
  • కే లక్ష్మణ్
  • ఇక్బాల్ సింగ్ లాల్ పురా
  • సుధా యాదవ్
  • సత్యనారాయణ జాటియా
  • భూపేంద్ర యాదవ్
  • దేవేంద్ర ఫడ్నవిస్
  • ఓం మాథుర్
  • బీఎల్ సంతోష్
  • వనతి శ్రీనివాస్

BJP
Central Election Committee
Narendra Modi
JP Nadda
Amit Shah
Nitin Gadkari
  • Loading...

More Telugu News