Kiara Advani: కియారా అద్వానీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్.. అసలు ఏం జరిగిందంటే..!

Kiara Advani trolled by netizens

  • ముంబైలో షూటింగ్ కు వెళ్తూ మీడియా కంట పడిన కియారా
  • వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకున్న బాడీ గార్డ్
  • ఏం నీకు చేతుల్లేవా? అంటూ కియారాపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో కియారా అద్వానీకి ఎంతో క్రేజ్ ఉంది. వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. దీనికితోడు ఒక బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తోందనే వార్తలతో ఆమె ఎప్పుడూ పతాక శీర్షికల్లోనే నిలుస్తోంది. మరోవైపు, 'భరత్ అనే నేను' సినిమాతో మహేశ్ బాబు సరసన ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మన దగ్గర కూడా కియారాకు మంచి అవకాశాలు వచ్చాయి. మరోవైపు ఈ బాలీవుడ్ భామపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. 

అసలు ఏం జరిగిందంటే... తాజాగా ఓ సినిమా షూటింగ్ కు వెళ్తూ ముంబైలో ఆమె మీడియా కంటపడింది. కారులో నుంచి కిందకు దిగి షూటింగ్ స్పాట్ కు ఆమె వెళ్తోంది. అదే సమయంలో వర్షం పడుతుండటంతో... ఆమె తడవకుండా బాడీ గార్డ్ గొడుగు పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆమెపై నెటిజన్ల కోపానికి కారణమయింది. గొడుగు పట్టుకునేందుకు నీకు చేతులు లేవా? అని కొందరు మండిపడగా... ఆమెకు చేతుల్లేవేమో, అందుకే గొడుగు పట్టుకోలేకపోయిందంటూ మరికొందరు విమర్శించారు. గొడుగు నీకు మాత్రమే అవసరమా... సెక్యూరిటీ గార్డుకు అవసరం లేదా? అని ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.

Kiara Advani
Bollywood
Tollywood
netizens
Trolling
  • Loading...

More Telugu News