Prabhas: ప్రభాస్ కథపైనే మారుతి కసరత్తు!

Maruthi Upcoming Movie Update

  • దర్శకుడిగా మారుతి మార్క్ ప్రత్యేకం
  • ప్రభాస్ ను ఒప్పించిన మారుతి 
  • రంగంలోకి దిగుతున్న బడా బ్యానర్లు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా సన్నాహాలు

ప్రభాస్ హీరోగా మారుతి ఒక సినిమా చేయనున్నాడు. ఆ విషయాన్ని మారుతి ధ్రువీకరించాడు కూడా. ఈ సినిమా ప్రభాస్ క్రేజ్ కి తగ్గకుండా.. తన మార్క్ నుంచి పక్కకి వెళ్లకుండా ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకి సంబంధించిన కథపైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.

సాధారణంగా మారుతి సినిమాలు లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీని కలుపుకుంటూ యాక్షన్ టచ్ తో నడుస్తుంటాయి. ప్రభాస్ సినిమాను కూడా ఆయన అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకునిరానున్నాడు. రెండు బడా బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తాయనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

ప్రభాస్ తో సినిమా అంటే దాని స్థాయి పాన్ ఇండియా అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కంటెంట్ పరంగా ఆ స్థాయిలోనే ఉంటుందట. ఖర్చు మాత్రం ఆ స్థాయిలో లేకుండా మారుతి ప్లాన్ చేస్తున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం 'ప్రాజెక్టు K' షూటింగుతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే మారుతితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని సమాచారం.

Prabhas
Maruthi Movie
Tollywood
  • Loading...

More Telugu News