Dadisetti Raja: పవన్ కల్యాణ్ కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని కాపులకు అర్థమైంది: మంత్రి దాడిశెట్టి రాజా

Dadisetti Raja comments on Pawan Kalyan

  • పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తిన మంత్రి రాజా
  • కాపులు పవన్ ను నమ్మబోరని వెల్లడి
  • జనసేనను ఎందుకు నమ్మాలో చెప్పలేకపోతున్నాడని విమర్శలు

ఏపీ ఆర్ అండ్ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాపులు పవన్ ను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తుని ఘటనలో కాపులను చిత్రహింసలకు గురిచేసిన చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

పవన్ కల్యాణ్ కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టేనని కాపులకు అర్థమైందని అన్నారు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో పవన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటున్న పవన్ కల్యాణ్ తానేమో టీడీపీ వైపు చూస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేందుకే పవన్ జనసేన పార్టీని స్థాపించాడని ఆరోపించారు.

Dadisetti Raja
Pawan Kalyan
Chandrababu
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News